Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Inthalone Kanabadi Anthalone Maayamayye

ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే

Inthalone Kanabadi Anthalone Maayamayye

Verse
ఇంతలోనే కనబడి అంతలోనే
మాయమయ్యే అలపమైన దానికా ఆరాటం
త్రాసుమీద ధూళి వంటి ఎత్తలేని
నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏదీ కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు
Verse
బంగారు కాసులున్న అపరంజి మేడలున్న
అంతరించి పోయెను భువినేలిన రాజులు
నాది నాది అంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా
Verse
మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో
ఆశ్రయించు యేసుని అనుకూల సమయంలో
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో

Related Tags

SalvationVanityTransience