Verse
ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే
యేసు రక్తంబున శుద్ధియగువారు కొందరే
Verse
ఎల్లరు యీ లోక సౌఖ్యమును పొందజూతురు
కొందరే శ్రమలయందు పాలుగోరెడి వారు
Verse
సైతానుతో పోరాడి జయము నొంద గోరిన
సంయుక్తుండవు కావలెను ప్రభు యేసునితో
Verse
పాడుచేసితివి దుష్టత్వంబులో నీ జీవితము
నేడైన నీ పాపములనుండి విడుదలొందవా
Verse
యేసు సేవకై నీ జీవితము నర్పించుము
యేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము