Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Iruvadi Naluguru Peddalatho

ఇరువది నలుగురు పెద్దలతో

Iruvadi Naluguru Peddalatho

Verse
ఇరువది నలుగురు పెద్దలతో
పరిశుద్ధ దూతల సమూహముతో‖ 2x ‖
నాలుగు జీవుల గానంతో‖ 2x ‖
స్తుతియింపబడుచున్న మా దేవా‖ ఇరువది ‖
Verse
భూమ్యాకాశములన్నియును
పర్వత సముద్ర జల చరముల్‖ 2x ‖
ఆకాశ పక్షులు అనుదినము‖ 2x ‖
గానము చేయుచు స్తుతియింపన్‖ ఇరువది ‖
Verse
కరుణారసమగు హృదయుడవు
పరిశుద్ధ దేవ తనయుడవు‖ 2x ‖
మనుజుల రక్షణ కారకుడా‖ 2x ‖
మహిమ కలిగిన మా ప్రభువా‖ ఇరువది ‖
Verse
గుప్పిలి విప్పి కూర్మితోను
గొప్పగ దీవెనలిచ్చెదవు‖ 2x ‖
గొర్రెల కాపరి దావీదు‖ 2x ‖
అయ్యెను ఎంతో మహారాజు‖ ఇరువది ‖

Related Tags

PraiseWorshipGlory