Verse
ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ
తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె‖ నిశ్రా ‖
Verse
తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన
శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె‖ నిశ్రా ‖
Verse
దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన
పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె‖ నిశ్రా ‖
Verse
జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి
మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ‖ నిశ్రా ‖
Verse
ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన
సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె‖ నిశ్రా ‖
Verse
ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని
వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ ప్రజ లొంద‖ నిశ్రా ‖
Verse
మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన
మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి‖ నిశ్రా ‖
Verse
మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో
మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె‖ నిశ్రా ‖
Verse
జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును
పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్‖ నిశ్రా ‖