Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ishrayelu Devaa Naa Sthuthulameeda Aaseenudaa

ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా

Ishrayelu Devaa Naa Sthuthulameeda Aaseenudaa

Verse
ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా
నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా‖ 2x ‖
ఏమని నిన్ను నేను కీర్తింతును
ఏమని నిన్ను నేను పూజింతును‖ 2x ‖
ఏమని నిన్ను నేను ఆరాధింతును‖ 2x ‖
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా‖ ఇశ్రాయేలు ‖
Verse
నా పితరులెందరో నిన్ను ఘనపరచి
దహనబలులు నీకు అర్పించగా‖ 2x ‖
ఇంపైన సువాసనగా అంగీకరించి
దీవెన వర్షము కురిపించితివే‖ 2x ఆరాధనా ‖
Verse
నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి
స్తుతుల సింహాసనము నీకు వేయగా‖ 2x ‖
ఆనంద తైలముతో నన్నభిషేకించి
స్తోత్రగీతముతో నన్ను నింపితివే‖ 2x ఆరాధనా ‖
Verse
నా కొరకు సీయోనును సిద్ధపరచి
మహిమతో తిరిగి రానైయుంటివే‖ 2x ‖
ఆనంద ధ్వనులతో నన్నూరేగించి
శాశ్వత జీవము నాకిచ్చితివే‖ 2x ఆరాధనా ‖

Related Tags

PraiseWorship