Verse
ఇతరుల సాక్ష్యము లెంతో గలిగియున్న మరి సాక్ష్యమే మంచిది
మృతిబొందిలేచియు న్నతమోక్ష రాజ్యాధి పతియై యున్న యేసు ప్రభువే
మా విభుఁడైన‖ నితరుల ‖
Verse
గురి సిలువ దెస మాకు స్థిరమై నిలిచియున్న దురితము తలయెత్తునే
మరి యేసు ప్రక్కలో చొరఁబారి యందున్న కరుణారసము గ్రోలు
టెఱిఁగి యుండిన చాలు‖ నితరుల ‖
Verse
తలవాల్చుటకు తనకు స్థలము లే దనునట్టి పలుకే మా కైశ్వర్యము
బలమిచ్చి యెదిగించు ప్రభు వాగ్దత్తములే మా కిలలో పంచభక్ష్య
ములుగా నుండిన చాలు‖ నితరుల ‖
Verse
బెదిరించి సైతాను కదిలింపలేనట్టి కుదురైన విశ్వాసము బొదలుచు
మాలో నిం పొదవుచుండిన చాలు మదిలో నెమ్మది యిచ్చు మా యేసు
కృప గల్గ‖ నితరుల ‖