Chorus
ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు నెయ్యముతో
తన శిష్యవితతికి నయముమీర జెప్పినట్లు‖ ఇయ్యుడి ‖
Verse
మొదట పరముని నంతునియ్యరే సదమల హృదయంబుతోడ సదయు
డగు మన పరమతండ్రి ముదమతోడ నంతయు నిచ్చున్‖ ఇయ్యుడి ‖
Verse
శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా జెప్పె భక్తితోడ ప్రభుని సేవకు
శక్తికొలది నియవలెను‖ ఇయ్యుడి ‖
Verse
కొంచెముగ విత్తెడివారు కొంచెము సమకూర్చెదరు హెచ్చువిత్తెడి
వారికిలను హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్‖ ఇయ్యుడి ‖
Verse
సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ వింతగా
దీవెనలతోడ అంతయు దయచేసి బ్రోచున్‖ ఇయ్యుడి ‖
Verse
యేసు కృపను ఎరిగిమనుడి యేసు మార్గమునందు నడువుడి దాసుడై
ధనమంత విడిచె నీచులకొరకిలను మున్నె‖ ఇయ్యుడి ‖
Verse
పరమనిధులను నింపుకొనుడి పరమ దేవుని ప్రేమను గనుడి పరమ
నిధులలో చిమ్మెటుండదు దొంగలసలే లేరుసుమండి‖ ఇయ్యుడి ‖