Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jaagore Jaagore

జాగోరే జాగోరే

Jaagore Jaagore

Verse
జాగోరే జాగోరే జాగు జాము రాతిరి
యేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్‖ 2x ‖
కన్నియ మరియ కన్నులు విరియ
పూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన‖ జాగోరే ‖
Verse
దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చింది
తారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది‖ 2x ‖
వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి‖ 2x ‖
ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా‖ జాగోరే ‖
Verse
వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మా
బోళము తెచ్చి కానుకలిచ్చి సాగిలపడిరమ్మా‖ 2x ‖
పోలి కేక పెట్టెనమ్మా – పొలిమేర దాటెనమ్మా‖ 2x ‖
ఆ పసిడి కిరణాల బాలుని చూసి ప్రకృతి మురిసెనమ్మా‖ జాగోరే ‖

Related Tags

JesusChristmasNativity