Verse
జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును
వందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చును
వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము
చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా
విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము‖ జాగ్రత్త ‖
గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము
లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె‖ జాగ్రత్త ‖
మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి
ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో‖ జాగ్రత్త ‖
దైవజనులు కలుతురు గగనమున – ప్రభునందు మృతులు జీవింతురు
మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు‖ జాగ్రత్త ‖
క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు
ప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు‖ జాగ్రత్త ‖