Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jaagraththa Bhakthulaaraa Pilupidhae Prabhuyaesu Vaegavachchunu

జాగ్రత్త భక్తులారా పిలుపిదే ప్రభుయేసు వేగవచ్చును

Jaagraththa Bhakthulaaraa Pilupidhae Prabhuyaesu Vaegavachchunu

Verse 1
Reference: ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. 1 థెస్స Thessalonians 4:16
Chorus
జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభుయేసు వేగవచ్చును
వందనం, హోసన్న, రాజాధిరాజు వచ్చును
వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము
Verse
చాలా రాత్రి గడిచిపోయె చూడు పగలు వచ్చెనుగా
విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము
Verse
గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము
లోతుభార్యను మరచిపోకు మేలుకొనెడి సమయమువచ్చె
Verse
మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి
ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో
Verse
దైవజనులు కలుతురు గగనమున - ప్రభునందు మృతులు జీవింతురు
మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు
Verse
క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు
ప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు

Related Tags

Second ComingRaptureEnd Times