Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jaaligala Daivamaa Yesayyaa

జాలిగల దైవమా యేసయ్యా

Jaaligala Daivamaa Yesayyaa

Verse
జాలిగల దైవమా యేసయ్యా
మనసారా స్తుతింతున్ స్తోత్రింతును
నీవు దేవుడు సర్వశక్తుడు‖ 2x ‖
నీ జాలికి హద్దులే లేవు
నీ ప్రేమకు కొలతలే లేవు‖ 2x ‖
అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‖ 2x జాలిగల ‖
Verse
నిజముగ మా యొక్క పాపములన్ మోసికొని
దుఃఖములను భరించితివే‖ 2x ‖
అయ్యా – దుఃఖములను భరించితివే‖ నీవు ‖
Verse
మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత
నీపైన పడెనే ప్రభూ‖ 2x ‖
అయ్యా – నీపైన పడెనే ప్రభూ‖ నీవు ‖
Verse
మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే
గాయములచే స్వస్థమైతిమి‖ 2x ‖
నీదు – గాయములచే స్వస్థమైతిమి‖ నీవు ‖

Related Tags

PraiseWorshipMercy