Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jadiyakumu Ne Ne Yunnaanani Kadu Na

జడియకుము నే నే యున్నానని కడు న

Jadiyakumu Ne Ne Yunnaanani Kadu Na

Lyricist: Bethala John
Chorus
జడియకుము నే నే యున్నానని కడు నెనరు వాక్కిచ్చిన యేసుని
యడుగుజాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవా యిడుమ లధికము
గలిగిన ప్రభుని కడకుఁ జేరరాదా‖ జడియకుము ‖
Verse
ఇప్పుడు నిను బాధపరచెడి ముప్పులం దలపోసి తప్పక గొప్ప ప్రేమార్థంపు
శిక్షకు నొప్పియుండరాదా నీ తప్పులన్ విడి ప్రభువు నందు మెప్పు
బొందరాదా‖ జడియకుము ‖
Verse
ఘనము ధనము సౌఖ్యంబు బోయి వ్యసనము శోధన మున్న యోబు
మనసు దృఢము చేసి ప్రభుని మహిమ పరపలేదా నీ మనసు
దృఢంబటుల జేసి మహిమ పరపరాదా‖ జడియకుము ‖
Verse
బీద లాజరుండు భువిని బాధ నొందిన సాదృశ్యంపు బోధన నీ
మానసమున పాదుకొనలేదా యతఁ డాదరింపఁబడిన విధము
మోద మియ్యలేదా‖ జడియకుము ‖
Verse
మున్ను సైఫనును రాళ్లతోఁ గొట్టు చున్న పగతుర కొరకు దేవుని మిన్ను
వైపునఁ జూచి యోర్చి మన్న నడుగలేదా నీ కున్న శ్రమలటు లోర్చఁ
బ్రభువు తెన్నుఁ జూపలేడా‖ జడియకుము ‖
Verse
భక్త జనులను ఖైదుకు నీడ్చి బాధలు గావించినప్పుడు శక్తి హీనుల
మంచు యేసుని శక్తి నమ్మలేదా యా యుక్తసహాయము దొరకువరకా
సక్తి నుండలేదా‖ జడియకుము ‖

Related Tags

FaithComfortEncouragement