Chorus
జగమంతా సంబరమే
చీకటి కమ్మెనే ఈ లోకంలో ఆజ్ఞను మీరగా ఏదేనులో
రక్షకుడొచ్చెనే మన రూపంలో విడుదలనిచ్చెనే తన రక్తంలో
ఈ లోకమునే వెలిగింపనూ
ఆ మహిమనే వీడెనూ
జగమంతా సంబరమే మొదలాయెనే
జయధ్వనులే చేయాలి మన యేసుకే‖ 2x ‖
Verse
నిరీక్షించే కన్నుల ఎదురుచూపు ఇతడే
నిత్యజీవమిచ్చే మోక్షమార్గం ఇతడే‖ 2x ‖
జనియించే రాజుగా భువినే పాలించ రా
భారములే బాప రా వచ్చెను మెస్సయ్యగా
ఈ లోకమునే‖ 2x ఈ లోకమునే ‖
Verse
పాతవన్ని పోయెను క్రొత్తవిగా మారెను
నిత్య నిబంధననే మనకు ఇచ్చెను‖ 2x ‖
మార్చెను కన్నీటినీ మహిమలో నాట్యముగా
నమ్మిన ప్రతివారినీ మార్చెను తన స్వాస్థ్యముగా
ఈ లోకమునే‖ 2x ఈ లోకమునే ‖