Verse
జగములనేలే శ్రీ యేసా
మా రక్షణ ప్రాకారమా
మా అనుదిన జీవాహారమా‖ 2x ‖
Verse
వేల్పులలోన నీవంటి దేవుడు
ఎవరున్నారు ప్రభు‖ 2x ‖
పూజ్యులలోన పూజార్హుడవు‖ 2x ‖
నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా‖ 2x ‖
అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవా
శరణము వేడిన అభయము నొసగే దేవా‖ 2x ‖
అవధులు లేని నీ ప్రేమను‖ 2x ‖
వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా‖ జగములనేలే ‖
Verse
జీవనమంతయు నీకర్పించి
పానార్పణముగా నే పోయబడుదును‖ 2x ‖
శ్రేష్టఫలములను ఫలియించెదను‖ 2x ‖
నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో‖ 2x ‖
విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవా
నలిగిన హృదయం నీ ఆలయంలో దేవా‖ 2x ‖
అన్ని వేళలలో మాతో ఉండి‖ 2x ‖
మమ్ము నడిపించు ప్రభో మమ్ము నడిపించు ప్రభో‖ జగములనేలే ‖