Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jai Jai Jai Jai Raajula Raajaa Paatrudu Veeve Maa Prabhu Veeve

జై జై జై జై రాజుల రాజా పాత్రుడ వీవే మా ప్రభు వీవే

Jai Jai Jai Jai Raajula Raajaa Paatrudu Veeve Maa Prabhu Veeve

Chorus
జై జై జై జై రాజుల రాజా
పాత్రుడ వీవే మా ప్రభు వీవే
Verse
అన్ని కాలములలో నీ నామము
మహోన్నతము మహోన్నతుడా
వాగ్దానము నెరవేర్చిన దేవా
మాట తప్పని మహోపకారి
Verse
దూతల మాదిరి గీతముల్ పాడుచు
సతతము నిన్నే స్తోత్రించెదము
గొల్లలు గాంచిన ఘన కాపరి మా
ఉల్లము నందు ఉల్లసించెదము
Verse
తూర్పున తారను గాంచిన జ్ఞానులు
రాజుల రాజ నీవే యనుచు
బంగారము సాంబ్రాణి బోళమును
అర్పించి ఆరాధించిరిగా
Verse
ధనవంతుడవగు ఓ మా ప్రభువా
ధనహీనుడుగా నైతివి మాకై
మా దారిద్ర్యము తీసివేయ
నరరూపమున జన్మించితివి
Verse
యేసు ప్రభుండా రక్తము కార్చి
ఎంచి మమ్ము విమోచించితివి
ఎంచలేను నీ మేలుల నెపుడు
ఎన్నదగిన మా దేవుడ నీవే
Verse
మాకై సిలువలో మరణించితివి
మరణపు ముల్లును విరచిన ప్రభువా
యుగయుగములకు నీకే మహిమ
నిరతము స్తోత్రము హల్లెలూయ

Related Tags

PraiseWorshipChristmas