Chorus
జై జై జై జై యేసు ప్రభు - మాకై రానున్న ప్రభువా
Verse
పరిశుద్ధాత్మ శక్తిని పొంది - భూదిగంతముల వరకు
సాక్షులుగా నుందు రనిన
Verse
అంద్రెయ సీమోనును చూచి - మెస్సీయాను కనుగొంటిమని
తెచ్చెనతని యేసు కడకు
Verse
పిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను ప్రకటింపగా
ఎంతో సంతోషము కలిగెన్
Verse
మనము ప్రభుని సంబంధులము లోబడె లోకము దుష్టునికి
లోకము ప్రభుని ఎరుగవలెన్
Verse
దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింపబడినందున
ధైర్యముతో చాటించెదము
Verse
ప్రభుని వాక్యము మన హృదయములో వసియించు
చున్నందున - వాక్యమును ప్రకటించెదము
Verse
నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తము
చేసెదను - యేసున కెప్పుడు హల్లెలూయ