Verse
జై జై యేసు రాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై‖ 2x జై జై ‖
Verse
పాపకూపములో బడియున్న‖ 2x ‖
నన్ను జూచి చేయి జాచి‖ 2x ‖
చక్కగ దరికి జేర్చితివి‖ 2x జై జై ‖
Verse
సిలువ రక్తములో నన్ను కడిగి‖ 2x ‖
పాపమంతా పరిహరించిన‖ 2x ‖
పావనుడగు నా ప్రభుయేసు‖ 2x జై జై ‖
Verse
నీతి హీనుడనైన నాకు‖ 2x ‖
నీతి రక్షణ వస్త్రములను‖ 2x ‖
ప్రీతితో నొసగిన నీతి రాజా‖ 2x జై జై ‖
Verse
మంటి పురుగునైన నన్ను‖ 2x ‖
మంటి నుండి మింట జేర్చిన‖ 2x ‖
మహాప్రభుండా నీకే జై జై‖ 2x జై జై ‖
Verse
పాపశాపగ్రస్తుడనై యుండ‖ 2x ‖
నన్ను గూడ నీ స్వకీయ‖ 2x ‖
సంపాద్యముగా జేసితివి‖ 2x జై జై ‖
Verse
రాజులైన యాజక గుంపులో‖ 2x ‖
నన్ను గూడ నీ సొత్తైన‖ 2x ‖
పరిశుద్ధ జనములో జేర్చితివి‖ 2x జై జై ‖
Verse
తల్లియైన మరచిన మరచును‖ 2x ‖
నేను నిన్ను మరువననిన‖ 2x ‖
నమ్మకమైన నా ప్రభువా‖ 2x జై జై ‖
Verse
అధిక స్తోత్రార్హుడవైన‖ 2x ‖
ఆది యంతము లేని దేవా‖ 2x ‖
యుగా యుగములకు నీకే జై జై‖ 2x జై జై ‖