Chorus
జై జై యేసురాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై
Verse
పాపకూపములో బడియున్న - నన్ను జూచి చేయి జాచి
చక్కగ దరికి జేర్చితివి
Verse
సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా పరిహరించిన
పావనుడగు నా ప్రభుయేసు
Verse
నీతి హీనుడనైన నాకు - నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన నీతి రాజా
Verse
మంటి పురుగునైన నన్ను - మంటి నుండి మింట జేర్చిన
మహాప్రభుండా నీకే జై జై
Verse
పాపశాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయ
సంపాద్యముగా జేసితివి
Verse
రాజులైన యాజక గుంపులో - నన్ను గూడ నీ సొత్తైన
పరిశుద్ధ జనములో జేర్చితివి
Verse
తల్లియైన మరచిన మరచును - నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా
Verse
అధిక స్తోత్రార్హుడవైన - ఆది యంతము లేని దేవా
యుగా యుగములకు నీకే జై జై