Chorus
జై ప్రభు యేసు - జై ఘన దేవా
జై ప్రభు జై జై రాజా - జై ప్రభు జై జై రాజా
Verse
పాపకూపములో పడి చెడి యుండగా
గొప్ప రక్షణ నిచ్చి దరి చేర్చిన
Verse
విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముని నీవు కడిగితివే
Verse
నా శైలమై యేసు నన్నావరింపగా
యే శోధనైన గెల్చునా?
Verse
కడు భీకరమగు తుఫానులలో
విడువక జయముగా నడుపుచున్న
Verse
పసితనము నుండి ముదిమి వరకు
విసుగక ఎత్తు-కొను రక్షకా
Verse
సమృద్ధుడు యేసు సహాయుడాయే
ఓ మృత్యువా! నీ ముల్లెక్కడా?
Verse
సమాధి గెలిచిన విజయుడుండగ
సమాధి నీకు జయమగునా?