Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janminche Janminche Yesayya Pashuvula Pakalona

జన్మించె జన్మించె యేసయ్యా పశువుల పాకలోనా

Janminche Janminche Yesayya Pashuvula Pakalona

Verse
జన్మించె.. జన్మించె..
యేసయ్యా పశువుల పాకలోనా.. ఓ.. ఓ ..
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
Verse
రాత్రివేళ గొల్లలు గొర్రెలు కాయుచుండగా
దేవదూత వచ్చి శుభవార్తను తెల్పెను‖ 2x ‖
సంతోషించి ఆనందించి
యేసును చూచి పరవశించి‖ 2x ‖
లోకమంతా శుభవార్తను ప్రకటించిరి
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
Verse
ఆకాశములో ఒక తార జ్ఞానుల కొరకు వెలసెను
యేసు పుట్టిన స్థలమునకు నడిపించెను‖ 2x ‖
బంగారు సాంబ్రాణి బోళం
బాల యేసునికి అర్పించి‖ 2x ‖
మనసార పూజించి కొనియాడిరి
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
Verse
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు
తన కిష్టులకు సమాధానము కల్గును గాక‖ 2x ‖
పశువుల పాకలో జన్మించిన యేసయ్యా
మన హృదయంలో జన్మించుటే క్రిస్మస్ పండుగా‖ 2x ‖
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..

Related Tags

JesusChristmasBirth