Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janminche Lokarakshakudu

జన్మించె లోకరక్షకుడు

Janminche Lokarakshakudu

Lyricist: Bishop Samuel Finny Pachigalla
Verse
జన్మించె లోకరక్షకుడు
మన పాప విమోచకుడు
జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు
ప్రభుల ప్రభువు రాజుల రాజు
పరము వీడి జన్మించె
జన్మించె
Verse
గాబ్రియేలు దూత
కాపరులకు చెప్పెనే
రక్షకుడు విమోచకుడు
మనకొరకు ఇల పుట్టాడని
పరలోక సైన్య సమూహము
ప్రభువును స్తుతియించెనే
ఆనంద ధ్వనులు చేస్తు
శుభములు తెలుపుతు వచ్చెనే
ప్రభుల ప్రభువు రాజుల రాజు
పరము వీడి జన్మించె
జన్మించె లోకరక్షకుడు
మన పాప విమోచకుడు
Verse
తూర్పు దేశ జ్ఞానులు
తారను చూచిరి
యూదుల రాజుగ
పుట్టిన వానిని కనుగొన వెతికిరి
తార నడిపే జ్ఞానులను
ప్రభువు పాద సన్నిధికి
కానుకలను అర్పించి
సాగిలపడి వందనం చేసెనే
జన్మించె లోకరక్షకుడు
మన పాప విమోచకుడు
జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు
ప్రభుల ప్రభువు రాజుల రాజు
పరము వీడి జన్మించె
నా నా నా నా నా

Related Tags

SalvationJesusChristmas