Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janminchinaadu Sri Yesuraaju Bethlehemandhuna

జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున

Janminchinaadu Sri Yesuraaju Bethlehemandhuna

Lyricist: Pastor Dr Pammi Daniel
Verse
జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున
సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
అక్షయ మార్గము నడిపించే మానవుడై
నిజమే నిజమే దీనవరుడై ఉదయించే
ఱేడు నేడు జనియించినాడు
ఆనందం అద్భుతం
రేడు నేడు జనియించినాడు
సంతోషం సమాధానం
లేఖనం నెరవేర్పుకై ఏతెంచెను ప్రభువు
దూత తెలిపెను ప్రభు రాకను బాసురంబగు క్రీస్తు
రాజితంబగు తేజంబవుతో ఉద్భవించినాడు
అంబరముగా ఆవిర్భవించె నీతిసూర్యుడై
రాజువైన మెస్సయ్యను పూజింపను రండి
అద్వీతీయుండగు కుమారుని చూతము రండి
మహిమ ఘనత ప్రభావముతో మహిలో వెలసెను నేడు
భూమిపై దిగి వచ్చెను మనకొరకు పాపహరుడై

Related Tags

JesusChristmasBirth