Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Janu Landaru Vinandi Divya Sangathi

జను లందఱు వినండి దివ్య సంగతి

Janu Landaru Vinandi Divya Sangathi

Verse
జను లందఱు వినండి
దివ్య సంగతి
తండ్రియైన దేవుఁ డెంత
ప్రేమ చూపెను.
యేసు క్రీస్తు నాకుఁగాను‖ యేసు క్రీస్తు ‖
బ్రాణ మిచ్చెను
తన్ను ఁ జేర నన్ను ఁ బిల్చెన్
క్రీస్తు వత్తును‖ క్రీస్తు వత్తును ‖
Verse
నరకోటి పాపమందు
మున్గి యుండఁగాఁ
తండ్రి వారలన్ రక్షింపఁ
ద్రోవ చేసెను.
Verse
మాకుఁ గాను ప్రాణమిచ్చి
మృత్యు వొందను
తన యేక పుత్రు నిచ్చి
పంపె నిలకున్.
Verse
ఆయనను నమ్మువారు
నాశ మొందక
నిత్యజీవ మొందిసదా
సంతసింతురు.
Verse
పాపభారము భరించు
పాపులెల్లరు
యేసు మాట వినఁగాను
బాధ తీఱును.
Verse
చేర రండి, సువిశ్రాంతి
నిత్యసంతుష్టి
మీకు నిత్తు నంచు యేసు
మిమ్ముఁ బిల్చును

Related Tags

InvitationGospelSalvation