Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jaya Jaya Yesu Jaya Yesu Jaya Jaya Kreesthu Ja

జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జ

Jaya Jaya Yesu Jaya Yesu Jaya Jaya Kreesthu Ja

Chorus
జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు
జయ జయ రాజూ జయ రాజూ జయ జయ స్తోత్రం జయ స్తోత్రం
Verse
మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను జయయేసు
పరమబలమొసగు జయయేసు శరణము నీవే జయయేసు
Verse
సమాధిగెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు
సమరము గెల్చిన జయయేసు అమరమూర్తివి జయయేసు
Verse
బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు
బండలు దీయుము జయయేసు అండకుచేర్చుము జయయేసు
Verse
ముద్రను గెల్చిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు
ముద్రను దీయుము జయయేసు ముద్రించుము నను జయయేసు
Verse
కావలిన్ గెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు
సేవలో బలము జయయేసు జీవము నీవే జయయేసు
Verse
సాతానున్ గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు
పాతవి గతియించె జయయేసు దాతవు నీవే జయయేసు

Related Tags

VictoryResurrectionEaster