Chorus
జయ జెండా పట్టుకొనెదం
మనం వీరులుగ నడిచెదము‖ 2x ‖
Verse
వెల్లువై సాతానొచ్చిన
ఆత్మతానే జెండా పైకెత్తును
జడియకు నా సోదరా
నీవు జడియకు నా సోదరి
Verse
వేవేలు శ్రమలొచ్చినన్
శోకముల్ దరికిరావు
ఆత్మఖడ్గముచే
మనం సాతానున్ జయించితిమి
Verse
గుట్టలైన మిట్టలైననూ
ప్రభువును వెంబడించెదం
నాగటిపై చేయి వేశాము
మనం వెనుకకు తిరిగిచూడము