Chorus
జయ విజయమని పాడుదమా జయ విజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు జయస్తోత్రం స్తుతిచేయుదమా‖ జయస్తోత్రం ‖
Verse
ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగినను
నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును‖ నడిపించును ‖
Verse
మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి
నా పాపముల అన్నింటి మన్నించి మలినము తొలగించును‖ తొలగించును ‖