Chorus
జయహే.. జయహే.. జయహే.. జయహే..
జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా
Verse
సిలువలో పాపికి విడుదల కలిగెనువిడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవెను జీవన మొదవెను
సిలువ పతాకము జయమును గూర్చెను
జయమని పాడెదనునా విజయము పాడెదను
నా విజయము పాడెదను
Verse
మరణపు కోటలో మరణమే సమసెను మరణమే సమసెను
ధరణిలో జీవిత భయములు దీరెను భయములు దీరెను
మరణములో సహ జయములు నావే‖ 2x ‖
Verse
శోదనలో ప్రభుసన్నిది దొరికెను సన్నిది దొరికెను
వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను
శోధన భాధలు బలమును గూర్చెను‖ 2x ‖
Verse
ప్రార్ధనకాలము బహుప్రియమాయెను బహుప్రియ మాయెను
సార్ధకమాయెను దేవుని వాక్యము దేవుని వాక్యము
ప్రార్ధనలే భలి పీఠములాయెను‖ 2x ‖
Verse
పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను ప్రాపక మొదవెను
వరుడగు యేసుని వధువుగ మారితి వధువుగ మారితి
పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను‖ 2x ‖