Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayam Jayam Mana Yesuke

జయం జయం మన యేసుకే

Jayam Jayam Mana Yesuke

Lyricist: John Kennedy Bethapudi
Verse
జయం జయం మన యేసుకే
మరణం గెలిచిన క్రీస్తుకే‖ 2x ‖
స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము‖ 2x ‖
పునరుత్ధానుడైన క్రీస్తుని
మహిమపరచెదము‖ 2x జయం జయం ‖
Verse
పాపములేని యేసుడు
సిలువలో పాపికై మరణించి‖ 2x ‖
మూడవదినమున – తిరిగి లేచెను‖ 2x ‖
మరణపు ముల్లును విరిచెను‖ 2x జయం జయం ‖
Verse
పాపము చేసి మానవుడు
కోల్పోయిన అధికారమును‖ 2x ‖
సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను‖ 2x ‖
సాతాను బలమును గెలిచెను‖ 2x జయం జయం ‖
Verse
పాపము విడిచి సోదరా
ప్రభు సన్నిధికి రారమ్ము‖ 2x ‖
పునరుత్ధాన శక్తితో నింపి‖ 2x ‖
పరలోకమునకు చేర్చును‖ 2x జయం జయం ‖

Related Tags

PraiseResurrectionEaster