Chorus
జయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే
మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే
Verse
ఆది అంతము అల్ఫ ఓమేగా ఆయనే ప్రభువు
ఆయన యేగా రానున్నవాడు శక్తిమంతుడు
Verse
ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను
ప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగ తీర్చె
Verse
యేసులో మమ్ము రక్తముద్వారా విమోచించితివి
యెంతో కృపతో మమ్మును కడిగి మన్నించి నావుగా
Verse
యేసులో మాకు యేశిక్షలేదు భయము బాపెగా
వాసిగా మరణబలము తొలగించి పాపము బాపెగా
Verse
క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను
కరుణించి మమ్ము అంగీకరించె ఎంతో అద్భుతము
Verse
మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మ ముద్ర నిచ్చెను
మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణ నచ్చె
Verse
ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమి
పరిశుద్ధులలో మహిమైశ్వరంబు యెంతో గొప్పది