Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayamani Paadu Prabhuyesunake Hosanna Jai

జయమని పాడు ప్రభుయేసునకే హోసన్న జై

Jayamani Paadu Prabhuyesunake Hosanna Jai

Verse
జయమని పాడు ప్రభుయేసునకే హోసన్న జై
ప్రభు వచ్చుచుండె యెంతో సంతసము
మధ్యాకాశమందు సంధించెదము
Verse
మనము మారెదము మర్మమిది గొప్పదే
బూరధ్వని మ్రోగగానే మన మెత్తబడెదము
ప్రియ యేసుని సంధింప, మనమాయనవారమే
Verse
ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా
ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము
పొందెదము ప్రభువునే, మనమాయనవారమే
Verse
మన నిరీక్షణయే ప్రభుని చూతుమని
తృప్తి చెంది నింపబడెదం వాంఛలు తీరును
ప్రభుని రుచించెదము, మనమాయనవారమే
Verse
దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే
దేవుని గృహ మానంద మహిమతో నిండియుండును
ప్రభువు మనవాడు, మనమాయనవారమే

Related Tags

PraiseWorshipSecond Coming