Chorus
జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు
సోదర సోదరి పిల్లలు పెద్దలు జయమని పాడుడి యేసునకు - జై‖ జై ‖
Verse
సిలువలో చిందిన రక్తమున పాప క్షమాపణ కలిగించె
Verse
యేసురక్తమున నీతికల్గె అగ్ని శిక్ష తొలగెను
Verse
రక్తాన ఆశ్చర్య క్రియజేసె పాపపు బంధము ద్రుంచెను
Verse
రక్త విలువచే ముక్తి గల్గె - ప్రభుని దాసుడనైతిని