Verse
పల్లవి: జయము క్రీస్తూ - జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
జయము క్రీస్తూ - జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో
జయము క్రీస్తూ - జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
Verse
దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
సాతానుని జాడ - సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ‖ జయము ‖
Verse
పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాపాత్ముల కెంత - భాగ్యమెంచె క్షమియించె
పాడుదమా స్తుతియించి‖ జయము ‖