Verse
జయము ప్రార్ధన జయము
మాకు దయచేయుమయ్యా
మా పరిస్థితులను ఈ లోక శక్తులను
జయించెదము ప్రార్ధన శక్తితో
Chorus
కావాలి కావాలి ప్రార్ధన శక్తి
ఇవ్వుము ఇవ్వుము ప్రార్ధన జయము
Verse
ఏలీయా మాంత్రికులపై పందెం కట్టి
ప్రార్ధింపగా పరలోక అగ్ని దింపితివి
నేటి ఏలీయా వోలే ప్రార్ధిస్తున్నాను
ఎస్తేరు ఉపవసించి ప్రార్ధింపగా
యూదులకు విడుదలిచ్చి జయమిచ్చితివి
నేటి ఎస్తేరు వోలే ప్రార్ధిస్తున్నాను
హన్నా కన్నీటితో ప్రార్ధింపగా
కన్నీరు తుడచుటకు జవాబిచ్చితివి
నేటి హన్నా వోలే ప్రార్ధిస్తున్నాను