Chorus
జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము యేసుతో
జయముగ వెడలెదము ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము
జేసెద మా ప్రభు వెంబడి‖ జయప్రభు ‖
Verse
ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును
ఆదర్శంబౌ ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగ‖ జయప్రభు ‖
Verse
ధర విరోధులు మమ్ము జుట్టగ దరి జేరెద మేసున్ ప్రభుని దరిజేరెద
మేము ధాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెద మేసుతో‖ జయప్రభు ‖
Verse
మా ప్రభు జూముము నీదు మార్గపు మాదిరి జాడలను నీ దగు
మాదిరి జాడలను మా పాదములను తొట్రిలకుండగ మా కిడు బలమును‖ యీ కృపాదినమున జయప్రభు ‖
Verse
మా కొరకై నీవు నడచిన మార్గము జూడగను మేము మార్గము జూడగను
మా రక్షక నీ అడుగుజాడలు మరువక విడువక నడువగ కృపనిడు‖ జయప్రభు ‖
Verse
ఇహపరముల నినుగాక ప్రేమతో ఎవరిని గొలిచెదము? ఎవరిని ప్రేమింప
వశమె? విహరించెదము యేసుని వెంబడి మహిమ రాజ్యమున యేసుని
గొలువగ‖ జయప్రభు ‖