Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayasheeludavagu O Maa Prabhuvaa Jayageethamul Paadedam

జయశీలుడవగు ఓ మా ప్రభువా జయగీతముల్ పాడెదం

Jayasheeludavagu O Maa Prabhuvaa Jayageethamul Paadedam

Chorus
జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం
Verse
పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి
కృతజ్ఞతచే హృదయము నిండె స్తుయింతుమో మా ప్రభు
Verse
నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయెను
ఉదయించెమాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము
Verse
అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును
నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడ నొసగితివి
Verse
శత్రుని వురిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి
భయభీతిలోన అభయంబు నిచ్చి విడిపించితివి మా ప్రభో
Verse
యుద్దంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను
అని ప్రభూ నీవు పోరాడితివి మా పక్షమందు నీవే
Verse
క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతో మము
ఊరేగించుచు మహిమ నొందుచున్న దేవా స్తోత్రములు
Verse
పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచు కొంటివి నీవు
విడువబడిన మమ్ము వివాహితగా జేసె హల్లెలూయా పాడెదము

Related Tags

PraiseWorshipVictory