Chorus
జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును
స్వతంత్రించు కొనెదరుగ వారే సమస్తమున్
Verse
ఎవరు యెదురుచూతురో సంసిద్దులౌదురు
ప్రభురాక నెవరాశింతురో కొనిపోవ క్రీస్తువచ్చును
Verse
యేసు శిష్యులతో పల్కె తిరిగి వత్తునని
సిద్ధపరతు స్థలమును నేనున్నచోట మీరుండ
Verse
యెవరేసునితో నడతురో ప్రత్యేకమవుదురు
మేల్కొనియున్న వారిని ప్రభుక్రీస్తు కొనిపోవును
Verse
క్షణములోనే మార్పుచెంది ఎత్తబడెదము
మమ్మును సిద్ధపరచిన శ్రీయేసును సంధింతుము
Verse
తన సన్నిధిలో మనల నిలుపు నిర్ధోషులనుగా
బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే
Verse
సదా ప్రభుని తోడనుండి స్తుతిచెల్లించెదము
అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా