Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayinchuvaadu Devakumarudu Bhayamu Chendhaka Yumdudi

జయించువాడు దేవకుమారుడు భయము చెందక యుండుడి

Jayinchuvaadu Devakumarudu Bhayamu Chendhaka Yumdudi

Verse 1
Reference: జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును ప్రకటన Revelation 21:7
Verse
జయించువాడు దేవకుమారుడు - భయము చెందక యుండుడి
సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును - సర్వ దేవుని వాక్కిదే
Verse
ఆది ప్రేమ వీడిన ఎఫెస్ సంఘమా - అదియే నీ కొఱత
జయించిన నీవు జీవఫలములను - ప్రియముగ భుజియింతువు
Verse
శ్రేష్ఠతమగు స్ముర్నా సంఘమా శ్రమలను నే మరువన్
జయించిన నీకు రెండవ మరణము భయపడి హానిచేయదు
Verse
పెర్గము సభ నీ బోధయు తప్పుడు - మార్గముల నెరుగుదున్
జయించిన మరుగైన మన్నా క్రొత్త పేరు తెల్ల రాతినిత్తున్
Verse
తుయతైర సభ నీశక్తి నెరుగుదున్ - నీ భయముల నెరుగుదున్
జయించిన జనులపై నధికారమిత్తున్ - వేకువ చుక్కనిత్తున్
Verse
సార్థిస్ సభ నీ చావు నే నెరుగుదు - త్వరలోన స్థిరపడుము
జయించిన నీకు తెల్లని వస్త్రము - లిచ్చి నిన్నొప్పుకొందును
Verse
ప్రియమగు ఓ ఫిలదెల్ఫియ సంఘమా - నీ అశక్యత తెలియున్
జయించిన స్తంభముగా నుంచి నీకు - క్రొత్త నామము నిడుదున్
Verse
లవొదికైయ సభ నీ లక్షణముల - దౌర్భాగ్యత తెలియున్
జయించిన నిన్ను సింహాసనమున - నాతో కూర్చుండనిత్తున్
Verse
జయమొందు విధమున తెల్పితి నిందు - జయించువారి భాగ్యము
అపజయమును పొందు విధమును దెల్పితి - నీవెటు నిల్చెదవో

Related Tags

VictoryRevelation