Verse
జీవ నాధ ముక్తి దాత
శాంతి దాత పరమాత్మ
పావనాత్మ పరుగిడి రావా
నా హృదిలో నివసింప రావా
నీ రాక కోసం వేచియున్నాను
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి‖ 2x ‖
ముక్తి ప్రసాదించుము
భక్తిని నేర్పించుము
నీ ఆనందముతో నను నింపుము‖ 2x ‖
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి‖ 2x జీవ నాధ ‖
నీ శాంతి నింపంగ రావా
నీ శక్తి నింపంగ రావా‖ 2x ‖
నీ పరమ వారములతో నింపేవా‖ 2x ‖
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి‖ 2x జీవ నాధ ‖