Verse
జీవాధిపతివి నీవే నా యేసయ్య
నాకున్న ఆధారము నీవేనయ్యా‖ 2x ‖
నీవుంటే చాలు, కీడు కదా! మేలు
లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు‖ 2x జీవాధిపతివి ‖
Verse
ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు
అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు‖ 2x ‖
నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము
నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము‖ 2x నీవుంటే ‖
Verse
రాజుల హృదయాలను తిప్పువాడవు
నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు‖ 2x ‖
ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను
నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా‖ 2x నీవుంటే ‖