Chorus
జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుద దీర్చుము
జీవనపథములో చీకటి పడువేళ జీర్ణించు కొనిపోవు జీవితాశలఁ బెంచ‖ జీవా ‖
Verse
విందుగృహమునకేగి వీక్షింతు భ్రమతో నీ వివిధసుభోజ్యంబులన్
విచ్ఛిన్నమైన నీ విమల దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి,
తినుచుందు‖ జీవా ‖
Verse
రుధిర ధారలలోన ఋజువౌ నీ ప్రేమలు రూపుమాయును పాపము
ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత ఋణభారములు దీరి రుచి
యించు నా బ్రతుకు‖ జీవా ‖
Verse
భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలియించు యీహోమము
ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణంబౌను ప్రతిరక్త
బిందువు‖ జీవా ‖
Verse
ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన ఆరాధించు నీ నామము
అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును
దేవా‖ జీవా ‖