Chorus
జీవమా చింతించకుండు నిన్నుఁ గావ వచ్చిన యేసు కరుణా మయుండు
జీవమా చింతించి క్షితి మూరె డైన నీ జీవము కున్నతిఁ జేసెదవా
కావున నీ చింతా క్రాంతము వెడలించు దేవుఁ డెహోవ నీ దిక్కని నమ్మి
||జీవమా||‖ జీవమా ‖
Verse
గగన వీధిని బోవు ఖగములు దున్నునా తెగఁగోసి కొట్లలో దాఁ
చునొకో యగణిత పక్షుల కాహార మియ్యంగ బెగడెద వెందుకు
పెంచు ని న్నత డు‖ జీవమా ‖
Verse
పక్షి వృక్షాదుల పై నింత ప్రేమతో భక్షణ లిచ్చుచుఁ బాలింపఁగా
నక్షరములకంటె హెచ్చుగ నన్నెంచి యక్షయముగ నేలు నల్పవిశ్వాసి
||జీవమా||‖ జీవమా ‖
Verse
మిశ్రాయీం బాధల మేరల దొలఁగించి యిశ్రాయేలుకు మన్నా
నియ్యలేదా యాశ్రయమై నీదు హస్తము విడువక నీ శ్రమలను బాపి
నిన్నేలునతడు‖ జీవమా ‖