Verse
జీవమార్గమున్
యేసూ, చూపవే
నీవు మాకు ముందు వేగ
వెంట వత్తు మేము వేగ
తండ్రి యింటికే
మమ్ము నడ్పవే
Verse
హింస కల్గెన
మమ్ము గావుమా
మమ్ము కష్టకాలమందు
నాదరించు భూమియందు
మింటిత్రోవలో
మమ్ము నడ్పవే.
Verse
సొంత వేదనన్
చింత కల్గినన్
అన్య హింసఁ గూర్చి యేడ్వ
మమ్ములన్ సహింపనిమ్ము
మేము సత్యమున్
చూడ నేర్పవే.
Verse
మా ప్రవర్తన
చక్కపర్చుమా
మాకు నెట్టి హింసలైన
నీ సహాయ మిచ్చి, నేటి
యాత్రకాఁగానే
తలుపు దీయవే.