Verse 1
Reference: యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? కీర్తన Psalm 116:12
Chorus
జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము
హల్లెలూయ హల్లెలూయ‖ 2x ‖
పావనుండా నీకు పలుమారు నేనింకేమియ్యంగ పాత్రుండను
హల్లెలూయ హల్లెలూయ‖ 2x ‖
Verse
వెలుగిచ్చినావు వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసి
అనుదినము మాకు ఆహారమిచ్చి - ఊపిరి పోసి కాపాడితివి
ఎంచ లేక నీ మంచి పనులు - హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్
హితుడా నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయ హల్లెలూయ‖ 2x ‖
Verse
కరుణ కిరీట మిచ్చెనని - గడిగడికి నాతో నడిచేనని
కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు
ఎంచ లేక నీ మంచి పనులు - హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్
హితుడా నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయ హల్లెలూయ‖ 2x ‖