Verse
గద్దియలో నుండి పారు - జీవపు నదినీరు
ఆశీర్వాదముతో నిండి - యేసు నుండి వచ్చును
Chorus
జీవంపు జలనదులు - ఉచిత జీవనది
రక్షకా నీ నుండి పారున్ - నాద్వారా పారనిమ్ము
Verse
రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్ను
ఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము
Verse
అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారును
అట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు