Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevamu Gala Devuni Sangham Entho Entho Ramyamu

జీవము గల దేవుని సంఘం ఎంతో ఎంతో రమ్యము

Jeevamu Gala Devuni Sangham Entho Entho Ramyamu

Verse
జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము
మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము
సంకల్పమందున మనముండినా
ఆ సంఘమందున వసియించినా
ఎంతో ఎంతో ధన్యము –‖ 2x జీవము ‖
Verse
యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము
సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది‖ 2x ‖
పాతాళలోక ద్వారములు
దాని ఎదుట నిలువవు‖ 2x జీవము ‖
Verse
యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము
పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు‖ 2x ‖
ఏ నరుడు దేవుని నిలయమును
పాడు చేయకూడదు‖ 2x జీవము ‖
Verse
యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక
సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును‖ 2x ‖
ప్రభు యేసు దివ్య మాదిరిలో
గమ్యము చేరగా సాగుదాం‖ 2x జీవము ‖
Verse
ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం
శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం‖ 2x ‖
లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం
లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం‖ జీవము ‖

Related Tags

FellowshipChurchBody Of Christ