Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevana Tholi Sandhya

జీవన తొలి సంధ్య

Jeevana Tholi Sandhya

Lyricist: Gudapati Isaac Varaprasad
Verse
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నా జీవన మలి సంధ్య నీతోనే అంతము‖ 2x ‖
నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది‖ 2x ‖
నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు‖ 2x జీవన ‖
Verse
నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు
నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు‖ 2x ‖
నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను
నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను‖ 2x ‖
దేవా నీవే నా ఆశ్రయ దుర్గము‖ 2x జీవన ‖
Verse
నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు
ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను‖ 2x ‖
నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా
నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా‖ 2x ‖
దేవా నను నీ సాక్షిగ నిల్పుమా‖ 2x జీవన ‖

Related Tags

PrayerLifeHope