Chorus
జీవపు మార్గ జ్యోతివి - సిలువ మోసిన యేసు
మహిమ పూర్ణుడగు నీవే - సిలువ మోసిన యేసు
Verse
శరీరధారివైతివి - నీ ప్రేమను కనుపరచితివి
దీనుల నుద్ధరించితివి - సిలువ మోసిన యేసు
Verse
నీవే మార్గ సత్యమని - నీకు పేరు కలిగెను
నిత్యజీవపు దాతవు - పునరుత్థానుడవు నీవే
Verse
అర్పణ చేసితివి బలిగా - సిలువపై నీ ప్రాణమును
కడిగితివి నీ రక్తముతో - సిలువ మోసిన యేసు
Verse
నీ ద్వారమున జేరితిమి - నీచులము అయోగ్యులము
నీకే మహిమ స్తుతి ఘనత - సిలువ మోసిన యేసు
Verse
కల్వరి మార్గ యాత్రికులం - నీకే జయమని పాడెదము
సర్వద నిను స్తుతియించెదము - సిలువ మోసిన యేసు