Verse
క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గలతీ Galatians 2:20
Chorus
జీవించుచున్నాడు యేసుప్రభు
నా హృదయములో నున్నాడు
కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును
Verse
మాటచే సాగరము పాయలై పోయె
కోటగోడలు కూలి మట్టలైనవి
గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే
కుష్ఠరోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా
Verse
నన్ను వదలక పట్టుకొనుము
నిన్ను విడువక వెంబడింతును
మరణించువేళ పరలోకపు
ఇంటికి నడుపు విమోచకుడా