Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevinchuchunnadhi Nenu Kaadhu

జీవించుచున్నది నేను కాదు

Jeevinchuchunnadhi Nenu Kaadhu

Lyricist: Bro Yesanna
Chorus
జీవించుచున్నది నేను కాదు
క్రీస్తుతో నేను సిలువవేయబడినాను
క్రీస్తే నాలో జీవించుచున్నాడు
Verse
నేను నా సొత్తు కానేకాను
క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను
నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు
యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది‖ జీవించు ‖
Verse
యుద్ధము నాది కానేకాదు
యుద్ధము యేసయ్యదే నా పక్షమున
జయమసలే నాది కానేకాదు
యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు‖ జీవించు ‖
Verse
లోకము నాది కానేకాదు
యాత్రికుడను పరదేశిని
నాకు నివాసము లేనేలేదు
యేసయ్య నివాసము నాకిచ్చినాడు‖ జీవించు ‖

Related Tags

DevotionalSurrenderChristian