Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevinchuchunnavanna Paeru Unnadhi

జీవించుచున్నావన్న పేరు ఉన్నది

Jeevinchuchunnavanna Paeru Unnadhi

Verse
జీవించుచున్నావన్న పేరు ఉన్నది
మృతుడవే నీవు మృతుడవే‖ 2x ‖
ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు
జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది
ఆ మొదటి క్రియను చేయుము రన్నా‖ 2x జీవించు ‖
Verse
సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు
నులివెచ్చని స్థితి ఏల సోదరా
సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు
నులివెచ్చని స్థితి ఏల సోదరీ
నా నోటి నుండి ఉమ్మి వేయ దలచి ఉన్నాను‖ 2x ‖
యేసు అన్న మాటను మరువబోకుము రన్నా‖ 2x జీవించు ‖
Verse
అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము
పరిశుద్దుడైనవాడు పరిశుద్దునిగుండ నిమ్ము‖ 2x ‖
వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు‖ 2x ‖
యేసు అన్న మాటను మరువబోకుము రన్నా‖ 2x జీవించు ‖
Verse
ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాకడ తెలియదురా
దొంగ వలె వచ్చెదనని అన్నాడు‖ 2x ‖
గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా‖ 2x ‖
అంతము వరకు నిలిచి యుండుమా‖ 2x జీవించు ‖

Related Tags

Second ComingRepentanceSpiritual Life